మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండాలో.. ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ (గ్రీన్కో) ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఒకే యూనిట్లో సౌర పవన హైడల్ విద్యుత్ ఉత్పాదన జరుగుతుందని.. సీఎం జగన్ వివరించారు. శిలాజ ఇంధనం ద్వారా విద్యుదుత్పత్తిని తగ్గించే ఈ ప్రాజెక్టు దేశానికి సరికొత్త మార్గం చూపుతుందని వ్యాఖ్యానించారు. మెగా పవర్ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
దీనిపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో గ్రీన్కో ఎనర్జీ కంపెనీ విషయంలో అవినీతి జరిగిందంటూ.. టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేసిన జగన్.. ఇప్పుడు అదే కంపెనీకి రిబ్బన్ కట్ చేశారని నారా లోకేష్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ ఎన్ని విమర్శలు చేసినా.. ఆఖరికి ఆయన బాటలో నడుస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్ని విమర్శలు చేసినా.. ఆఖరికి జగన్రెడ్డి కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ధ్వజమెత్తారు నారా లోకేష్.