కేన్స్‌ ఫెస్టివల్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ప్రసంగం..

-

అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్‌ ఫిలిం ఫెస్టివల్‌ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఫెస్టివల్‌ ప్రారంభ వేడుకల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగించిన వీడియోకు హర్షధ్వానాల నడుమ ప్రశంసలు దక్కాయి. వీడియో లింక్ ద్వారా కీవ్ నుంచి ప్రసంగించిన ఆయన తెరపై కనిపించగానే హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రేనియన్లకు సినీ ప్రపంచం అండగా నిలవాలని, సంఘీభావం తెలపాలని కోరారు జెలెన్‌స్కీ. సినిమా-వాస్తవికత మధ్య ఉన్న సంబంధంపై సుదీర్ఘంగా మాట్లాడిన జెలెన్‌స్కీ ఈ సందర్భంగా 1979లో వచ్చిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాల సినిమా ‘అపోకలిప్స్ నౌ’, 1940లో వచ్చిన చార్లీచాప్లిన్ సినిమా ‘ది గ్రేట్ డిక్టేటర్’లను ప్రస్తావించారు జెలెన్‌స్కీ.

‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాను ఉటంకిస్తూ.. ‘‘మనుషుల మధ్య విద్వేషం నశించిపోతుందన్న జెలెన్‌స్కీ … నియంతలు అంతమవుతారన్నారు. ప్రజల నుంచి లాక్కున్న అధికారం తిరిగి ప్రజల చేతుల్లోకి వస్తుంది అని జెలెన్‌స్కీ నొక్కి చెప్పారు. మన కాలపు సినిమా నిశ్శబ్దంగా లేదని చాటిచెప్పే మరో కొత్త చార్లీ చాప్లిన్ కావాలని అన్నారు. వారి భవిష్యత్ సినిమాపైనే ఆధారపడి ఉందని చెప్పిన జెలెన్‌స్కీ.. నేడు సినిమా నిశ్శబ్దంగా లేదని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ప్రజల చేతుల్లోంచి లాక్కున్న అధికారం తిరిగి వారికే దక్కుతుందని స్పష్టం చేశారు. జెలెన్‌స్కీ ప్రసంగానికి ప్రతి ఒక్కరు లేచి నిలబడి హర్షధ్వానాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news