2 గంటల కన్నా ఎక్కువ సేపు స్క్రీన్ చూస్తున్నారా? అయితే, మీ ఆయుష్షు ఎంత తగ్గుతుందంటే..

-

ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం వల్ల ప్రాణాంతక సమస్యలు వస్తాయట. ఈరోజుల్లో చాలామంది జీవితాల్లో డిజిటలైజేషన్ భాగం అయిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపిల్లలు సైతం ఆన్ లైన్ క్లాసుల పేరిట స్క్రీన్ టైం పెరిగిపోతుంది. ఇలా అందరూ తన దయనందిన జీవిత్లాలో ఏదో ఒక కారణంగా స్క్రీన్ ఎక్కవ సేపు చూస్తున్నారు. స్క్రీన్ టైం పెరగటం వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
సాధారణంగా ఎక్కువ సేపు చేయడం ద్వారా కంటి అలసట, మెడ నొప్పి, ఆందోళన, ఊబకాయం మరియు అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయని మనకు తెలిసిందే…అయితే ఈ సమస్యలతో పాటు మానసిక మరియు శారీరక సమస్యలకు కారణమవుతుందని, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని చాలామందికి తెలియదు.
ఇటీవలి పరిశోధనల ప్రకారం.. మన దైనందిన జీవితంలో స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల మనకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరిగిందని తేలింది. అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ యొక్క స్ట్రోక్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
స్క్రీన్ దగ్గర కూర్చుని గడిపే సమయం రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ ఉంటే… స్ట్రోక్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయని డేటా చెబుతోంది. నిరంతరాయంగా స్క్రీన్ ముందు కూర్చొని రెండు గంటల కంటే ఎక్కువసేపు ఉంటే అది ఒక రకమైన వ్యసనంగా మారడంతో పాటు మనకు స్ట్రోక్ వచ్చే అవకాశాలను మరో 20 శాతం పెంచుతుందని అధ్యాయనంలో తేలింది.
ఒక గంట స్క్రీన్ సమయం ఒక వ్యక్తి యొక్క జీవితకాలం 22 నిమిషాలు తగ్గిస్తుందని నివేదిక వెల్లడించింది. ఇంకా గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతూ వ్యక్తిని మరణానికి దగ్గరగా చేస్తుందట. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మరొక అధ్యయనం స్క్రీన్ వాడకం మరియు స్ట్రోక్ మధ్య సంబంధాన్ని కనుగొంది.
ఈ పరశోధన ఆందోళనకరంగానే ఉందని..తెరపై కనిపించే నీలి కాంతి మన శరీరంలోని మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మెలటోనిన్, రాత్రి సమయంలో స్రవించే హార్మోన్. ఈ హార్మోన్ నిద్ర మరియు మేల్కొలుపు మధ్య సంబంధాన్ని నియంత్రిస్తుంది. ఉద్యోగాలు చేసేవారి జీవితం స్క్రీన్ పైనే ఆధారపడిఉంటుంది. కచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి..మీకు వీలైనంత వరకూ అనవసరం అనుకునే వాటికి స్క్రీన్ చూడటం తగ్గించండి..అంతేకాదు..ప్రతి 20నిమిషాలకు ఒకసారి..20 మీటర్ల దూరంలో ఉన్నవాటిని20 సెకన్ల పాటు చూడండి. దీనినే 20 20 20 నియమం అంటారు. కళ్లు అలసట కాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటే..త్వరగా అనారోగ్యసమస్యల భారిన పడకుండా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news