వేధింపుల‌కు గుర‌య్యే పురుషుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందే.. బీజేపీ ఎంపీల డిమాండ్‌..!

-

మ‌న దేశంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు అనేక చ‌ట్టాలున్నాయి. వేధింపుల నిరోధ‌క చ‌ట్టం, నిర్భ‌య చ‌ట్టం.. ఇలా అనేక చ‌ట్టాలు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నాయి. అందుక‌నే మ‌గాళ్లు ఎవ‌రైనా మ‌హిళ‌ల‌ను వేధిస్తే వారు త‌మ‌ను ర‌క్షించాల‌ని కోరుతూ న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చు. దీంతో ఆయా చ‌ట్టాల ప్ర‌కారం బాధిత మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. త‌మ‌కు జ‌రిగిన అన్యాయానికి న్యాయం జ‌రుగుతుంది. అయితే ఈ చ‌ట్టాల‌న్నీ కేవ‌లం మ‌హిళ‌ల కోస‌మే. అదే మ‌హిళ‌ల చేతిలో వేధింపుల‌కు గుర‌య్యే పురుషుల‌కు మాత్రం ఎలాంటి చ‌ట్టాలు లేవు. అందుక‌నే అలాంటి పురుషుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేలా చ‌ట్టాల‌ను ఏర్పాటు చేయాల‌ని ఇద్ద‌రు భాజ‌పా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.

తమ రక్షణ కోసం ఉన్న చట్టాలను దుర్వినియోగం చేస్తూ భర్తలను హింసిస్తోన్న భార్యలపై చర్యలు తీసుకునేందుకు, పురుషులు తమ హక్కులను పరిరక్షించుకునేందుకు పురుష కమిషన్ ను ఏర్పాటు చేయాల్సి ఉందని యూపీ భాజపా ఎంపీలు హరి నారాయణ్‌ రాజ్‌భర్‌, అంశుల్‌ వర్మలు డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే తాము ఈ నెల 23న ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. తాము పురుష్‌ ఆయోగ్‌ పేరుతో సమావేశం నిర్వహించి ఇందుకు మద్దతు కూడగడతామని ప్రకటించారు. ఈ విషయంపై తాము ఇప్పటికే పార్లమెంటులోనూ మాట్లాడామని చెప్పారు.

తమ త‌మ‌ భార్యల చేతిలో పురుషులు కూడా కష్టాలు అనుభవిస్తున్నార‌ని, ఇటువంటి చాలా కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయ‌ని, మహిళకు న్యాయం చేయడానికి ఎన్నో చట్టాలు, సంఘాలు ఉన్నాయి కానీ పురుషులకి మాత్రం ఏమీ లేవని అన్నారు. కాబట్టి పురుషులకు కూడా ఓ కమిషన్‌ కావాల‌ని, పురుషుల సమస్యలను చర్చించి వారికి న్యాయం చేయడానికి కూడా ఓ కమిషన్‌ కావాల‌ని అన్నారు. జాతీయ పురుష కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. కాగా ఈ విష‌యంపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్లూ) ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందిస్తూ.. తమ డిమాండ్లపై మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, పురుషుల కమిషన్‌ ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను.. అని అన్నారు. ఏది ఏమైనా.. ఈ విష‌యం మాత్రం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మే అవుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news