చూడటానికి బుడ్డోడిలా ఉన్న ఆ యువకుడి పేరు అజీమ్ మన్సూరి. ఊరు యూపీలోని కైరానా. వయసు ఎంతో తెలుసా? 26 ఏళ్లు. పుట్టినప్పటి నుంచే మరుగుజ్జు కావడంతో.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదు.
చూశారుగా.. అబ్బాయి ఎంత పొడుగున్నాడో. అదే అతడి సమస్య. అతడు ఉన్నది మూడంటే మూడే అడుగులు. జబర్దస్త్‌లో వచ్చే పొట్టి నరేశ్ కంటే కూడా పొట్టిగా ఉంటాడు ఈయన. దీంతో ఈ వ్యక్తికి పిల్లను ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. అంత పొట్టిగా ఉన్న వాళ్లను ఏ అమ్మాయి చేసుకుంటుంది. మరుగుజ్జులను చేసుకోవాలంటే మరో మరుగుజ్జు అమ్మాయే రావాలి. కానీ.. మనోడిని చూసి మరుగుజ్జు అమ్మాయిలు కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదట.
అతడి తల్లిదండ్రులు కూడా మనోడి పెళ్లి కోసం చాలా సంబంధాలు వెతికారట. కానీ.. ఏం లాభం. అమ్మాయి మాత్రం దొరకలేదు. దీంతో చేసేది లేక చేతులెత్తారు మనోడి తల్లిదండ్రులు. దీంతో ఏం చేయాలో తెలియక మెజిస్ట్రేట్‌నే కలిశాడు ఆ బుడ్డోడు. అదే ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
చూడటానికి బుడ్డోడిలా ఉన్న ఆ యువకుడి పేరు అజీమ్ మన్సూరి. ఊరు యూపీలోని కైరానా. వయసు ఎంతో తెలుసా? 26 ఏళ్లు. పుట్టినప్పటి నుంచే మరుగుజ్జు కావడంతో.. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకడం లేదు. చిన్నప్పుడే చదువు మానేసి.. ప్రస్తుతం కిరాణ స్టోర్స్ నడుపుతున్నాడు. జీవితంలో సెటిల్ అయ్యాడు కానీ.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయి దొరకడం లేదు.
దీంతో డైరెక్ట్‌గా మీరట్ వెళ్లి.. అక్కడి మెజిస్ట్రేట్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. మెజిస్ట్రేట్‌కు ఓ వినతి పత్రం కూడా ఇచ్చాడు. ఆ వినతి పత్రం చూసి మెజిస్ట్రేట్ కూడా షాక్ అయ్యాడు. చేసేదేం లేక.. పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు.. అజీమ్ ఇంటికి వెళ్లి ఆయన తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎలాగైనా తామే దగ్గరుండి.. అమ్మాయిని చూసి అజీమ్‌కు పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అజీమ్ కాస్త కుదుటపడ్డాడు. రంజాన్ మాసం అయిపోయేలోపు తన పెళ్లి అయిపోవాలని కోరుకుంటున్నాడు అజీమ్. చూద్దాం.. ఆయన తల్లిదండ్రులు కాకున్నా.. పోలీసులన్నా అజీమ్ పెళ్లి చేస్తారో లేదో?