ఇవాళ ఆంధ్రాకు, తెలంగాణకు మధ్య వైరాలు అయితే పెద్దగా ఏమీ లేవు. అభివృద్ధి విషయమై పోటీ అయితే ఉంది. కొన్ని విషయాల్లో తెలంగాణ సర్కారు ఆంధ్రాను మించి పనిచేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో జగన్ కూడా వెనక్కు తగ్గని నైజంతోనే ఉన్నారు. మంచి పాలన ఇవ్వాలన్న తలంపుతోనే ఉన్నారు. పెట్టుబడుల ఆకర్షణల్లో జగన్ ది తొలి అడుగు కాగా, కేసీఆర్ ఇప్పటికే చాలా అడుగులు ఆ దిశగా వేసి సఫలీకృతం అయ్యారు.
ఇక రాజకీయ నేపథ్యాలు చూసుకున్నా జగన్ ఓ ఉప ప్రాంతీయ పార్టీ ని లీడ్ చేస్తూ.. తెలంగాణపై కూడా పట్టు తెచ్చుకోవాలని యోచిస్తున్నారు. కేటీఆర్ మాత్రం కేవలం తనని తాను తెలంగాణకు మాత్రమే పరిమితం చేసుకుంటూ, అక్కను జాతీయ రాజకీయాల్లో మళ్లీ చూడాలి, నాన్నను జాతీయ రాజకీయాల్లో చూడాలి అన్న తపనతో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో గతంలో జగన్ రాణించాలని అనుకున్నా అవేవీ సాధ్యం కాలేదు. కేసీఆర్ కుటుంబం ఆ విషయంలో ముందుంది. అనుకున్నవి కాస్తో కూస్తో సాధించింది కూడా! ఈ దశలో ఇరు వర్గాలూ మళ్లీ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అదే నిన్నటి వేళ చర్చకు వచ్చే అవకాశాలు ఉండి ఉండవచ్చు కూడా !