పులిపిర్లు ఎందుకు వస్తాయి..? ఇలా తగ్గించేద్దామా..!

-

మన బాడీలో కొన్ని మన ప్రమేయం లేకుండానే కొన్ని జరుగుతాయి.. పుట్టకతోనే పుట్టమచ్చలు వస్తాయి. చాలామంది.. అరే ఇక్కడ కాకుండా ఇంకొ దగ్గర ఈ మచ్చ ఉంటే బాగుండే అనుకుంటారు కదా..! ఇంకా పులిపిర్లు. ఇవి అసలు ఎందుకు వస్తాయో కూడా తెలియదు. ఒకప్పుడు అంటే..వీటిని పెద్దగా పట్టించుకునే వారు కాదు.. అవి కూడా పెరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పార్లర్స్ లో వీటిని తొలగిస్తున్నారు. అసలు ఇవి ఎందుకు వస్తాయో మీకు తెలుసా..? ఈరోజు మనం ఇవి రావడానికి కారణాలు, తొలగించుకునే మార్గాలు చూద్దామా..!

చర్మ శుభ్రత పాటించని వారిలో పులిపుర్ల ఏర్పడటానికి ప్రధాన కారణంగా నిపుణులు అంటున్నారు. మొహం, మెడ, గొంతు భాగాలు సరిగా రుద్దక పోవటం వల్ల మురికి పొరలుగా అట్టులుకట్టి, నల్లగా మారి మందంగా, వికృతంగా కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో పులిపిర్లు ఏర్పడతాయి.

కొన్ని చోట్ల పులిపుర్లు ఒకే ప్రాంతంలో ఎక్కువగా ఏర్పడుతుంటాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో కూడా పులిపిర్ల సమస్య అధికంగా ఉంటుంది. పులిపిర్లు రాగానే చాలా మంది అనేక నాటు పద్దతులను ఉపయోగించి ఎలాగైనా వాటిని తొలగించుకుందా అనకుంటారు. సన్నని వెంట్రుకలను పులిపిర్లకు చుట్టటం, బ్లేడుతో కోయటం, గిల్లటం వంటివి చేస్తుంటారు. దీని వల్ల ఆ ప్రాంతంలో పుండు పడి ఇబ్బందికరంగా మారుతుంది. అంతేకాకుండా పరిసర ప్రాంతాలకు అవి విస్తరిస్తాయి కూడా.

పులిపిర్లకు తీసుకోవలసిన జాగ్రత్తలు…

చల్లని నీటితో తరుచుగా ముఖం, గొంతు, మెడభాగాలను శుభ్రం చేసుకోవటం వల్ల పులిపిర్ల భాగాల్లో ఎక్కువ మట్టి పేరుకోకుండా ఉంటుంది.

రోజ్ వాటర్, ఫ్లవర్ జూస్ లలో 6 చుక్కలు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి , దూదితో ముంచి శుభ్రం చేస్తూ ఉండాలి.

నెలకొకసారి హెర్బల్ బ్లీచ్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల పేరుకున్న మట్టి తొలగిపోతుంది.

మేకప్ వేసుకుంటే రాత్రి సమయంలో నిద్రకు ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.

నాసిరకం క్రీములను వాడకుండా ఉండటం మంచిది.

ముఖం, మెడ చుట్టూ పరిసరాలకు సూర్యకిరణాలు తగిలేలా చూసుకోవాలి.

10 రోజుల కొకసారి పుల్లని మజ్జిగ తేటను మరిగించి ముఖానికి ఆవిరి పెట్టుకోవటం మంచిది.

ఇలా చేస్తే పోతాయి..

ఎర్రని, నల్లని బొడిపెల వంటి వాటికి మామిడి టెంకలోని జీడిని నల్లగా కాల్చి ఆ మసిలో లేత మామిడి ఆకు పసరు కలిపి వరుసగా పదిరోజులు పూస్తే పులిపిర్లు పూర్తిగా నయమైపోతాయి. హెర్బల్ విధానంలో కూడా మచ్చలు పడకుండా పులిపిర్లను తొలగించుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉండే చర్మవ్యాధి నిపుణుల ద్వారా తగిన చికిత్స పొందటం మంచిది. సో ఇది మ్యాటర్..!

Read more RELATED
Recommended to you

Latest news