ప్రారంభమైన తొలి ప్లే ఆఫ్ మ్యాచ్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌

-

ఐపీఎల్ 15వ సీజన్ లో నేటి నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభమయ్యాయి. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారథి హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్‌ ఓడి.. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ప్రారంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (3) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు.

Gujarat Titans vs Rajasthan Royals Prediction: Who Will Win The Match  Between GT And RR? IPL 2022, Qualifier 1, GT vs RR

యష్ దయాళ్ వేసిన రెండో ఓవర్లో షాట్లు ఆడటానికి తడబడిన అతను.. చివరి బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ సాహా చేతుల్లో పడింది. దీంతో రాజస్థాన్ జట్టు 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే.. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్స్ కు చేరుకుంటుంది ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news