తొలి దళిత మేయర్‌గా మొహిందర్‌ కె.మిధా

-

భారత సంతతికి చెందిన నాయకురాలు మొహిందర్‌ చరిత్ర సృష్టించారు. పశ్చిమ లండన్‌లోని ఈలింగ్‌ కౌన్సిల్‌ మేయర్‌గా యూకేలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీ కౌన్సిలర్‌ మొహిందర్‌ కె.మిధా ఎన్నికయ్యారు. అయితే.. తద్వారా యూకేలో తొలి దళిత మహిళా మేయర్‌గా మొహిందర్‌ కె.మిధా రికార్డుకెక్కారు. మొహిందర్‌ కె.మిధా ఎన్నిక పట్ల లేబర్‌ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు గర్వకారణమనియూకేలోని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ అంబేడ్కరైట్, బుద్ధిస్ట్‌ ఆర్గనైజేషన్‌’ చైర్మన్‌ సంతోష్‌దాస్‌ వెల్లడించారు.

Mohinder K Midha

మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మిధాను 2022-23 తదుపరి ఏడాది కాలానికి ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలను బ్రిటిష్ దళిత సంఘాలు గర్వించదగ్గ ఘట్టంగా పేర్కొంటున్నాయి. దళిత వర్గానికి చెందిన స్థానిక లండన్ కౌన్సిల్‌కు మొదటి మహిళా మేయర్‌గా అవతరించడం మాకు ఎంతో గర్వంగా ఉందని స్థానిక దళిత సంఘాల నాయకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news