ఆ తల్లి పదేళ్ల ‘పరాఠా’ల కష్టం.. నేడు గుర్తించిన సోషల్ మీడియా..!

-

మనవికాని రోజుల్లోనూ నిలదొక్కుకుని ఎదగటమే తెలివైనవాడి లక్షణం..cకష్టం రాగేనే కుంగిపోయి..cనా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడుతూ…cసమయాన్ని వృద్ధా చేస్తుంటారు చాలామంది…. అసలు లైఫ్ లో కష్టాలు లేని వాళ్లు ఉంటారా?..cనష్టాలు లేని రైతు..ఈఎమ్ఐలు లేని ఉద్యోగి అంటూ ఎవరూ ఉండరూ..ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్లకు ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఈమె కథ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. భర్తపోయి..నలుగురు కుమార్తెల ఆలనాపాలనా చూస్తూ.. పరాఠాలు చేసుకుంటూ..బతుకుబండిని నడిపేస్తుందీ ఈ మహిళ. ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది..ఈ స్పూర్తికథనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆమె పేరు వీణ..భర్త, నలుగురు కూతుళ్లతో కలిసి అమృత్‌సర్‌లోనే నివాసముండేది. ఆమె భర్త బండి మీద పరాఠాలు తయారుచేసి అమ్ముకుంటూ కుటుంబాన్ని చూసుకునేవారు. వీణ కూడా ఇరుగుపొరుగు ఇళ్లలో పాచి పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉండేది. ఈ క్రమంలోనే వీణ జీవితం మారిపోయింది..భర్త చనిపోయాడు. దీంతో కుటుంబ భారమంతా ఆమె పైనే పడింది. అసలే ఆర్థికంగా లేని కుటుంబం..అందులోను నలుగురు కూతుళ్లు. ఈరోజుల్లో మధ్యతరగతి వారికే ఒక కూతుర్ని పెంచటం కష్టంగా మారింది..అలాంటిది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వీణకు ఆ కూతుళ్ల ఆలనా పాలనా తనపై పడటంతో ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కే మార్గం దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది

పాచిపని చేస్తే లాభం లేదని..భర్త వ్యాపారాన్ని తాను కొనసాగించాలని డిసైడ్ అయింది. అలా సుమారు 10 ఏళ్ల నుంచి రెహ్రి ఫుడ్‌ స్ట్రీట్‌లో పరాఠాల వ్యాపారం చేస్తోంది వీణ. అంతేకాదు.. ఆమె తయారుచేసే పరాఠాలకు అతిపెద్ద పరాఠాలు(జంజో)అని పేరు కూడా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చిన వారంతా ఈ జంబో పరాఠాల రుచి చూడందే ఈ ఫుడ్‌ స్ట్రీట్‌ను వీడరని స్థానికులు చెబుతుంటారు.

ధర తక్కువ సైజ్ ఎక్కువ..టేస్ట్ డబుల్

వీణ తయారుచేసే జంబో పరాఠాలకు రోజూ అక్కడ మాంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే కేవలం రూ. 30 కే రుచికరమైన పరాఠాలు తయారుచేసి అక్కడి ఆహార ప్రియుల్ని ఆకట్టుకుంటుంది వీణ. ఇలా ఆమె జంబో పరాఠాలతో పాటు, కుటుంబ పోషణ కోసం ఆమె పడుతోన్న కష్టం గురించి ఓ బ్లాగర్‌ ఇటీవలే తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇది వైరలవడంతో ఇప్పుడు ఆమె గురించి దేశవ్యాప్తంగా తెలిసింది.

దీంతో అపర్‌శక్తి ఖురానా వంటి ప్రముఖులు కూడా కుటుంబ పోషణ కోసం ఆమె పడుతోన్న తాపత్రయాన్ని ప్రశంసిస్తున్నారు. ‘కూతుళ్ల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లి ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా ఓర్చుకుంటుందంటూ నెటిజన్లు ప్రశింస్తున్నారు. కేవలం కామెంట్లు అయితే..ఒరిగేదేమీ లేదు కదా..కొందరు ఆమెను రెస్టారెంట్ ప్రారంభించి వ్యాపారాన్ని వృద్ది చేసుకోమని నిధులు కూడా ఇవ్వటం విశేషం.

కూతుళ్లకు మంచి భవిష్యత్తు అందించడానికే తన భర్త వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించినానని..తన కృషి, దేవుడి దయ వల్లే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాం అంటోంది ఆ తల్లి వీణ.

పదేళ్ల కష్టాన్ని ప్రపంచం ఈరోజు గుర్తించింది. ఎవరో చూస్తారు, ఇంకేవరో గుర్తించాలి అనే ధోరణిలో కాకుండా..మనకోసం మనం కష్టపడి పనిచేసుకుంటూ నెగ్గుకొస్తే..ఫలితం వచ్చి తీరుతుంది..కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సమయం మనది కానప్పుడు కూడా సంయవనం పాటించిన వీణ కథ..ఎంతోమంది తల్లులకు, పిరికి ప్రేమికులకు, బలహీనమైన మనస్సుగల వారికి ఆదర్శమే కదా..మీరేంమంటారు.?

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news