పుట్టింటి దగ్గర ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్తకు తెలిసి…

కట్టుకున్న భర్త, కన్న పిల్లలతో జీవితాన్ని సాఫీగా కొనసాగించాల్సింది పోయి.. అక్రమం సంబంధం పెట్టుకొని జీవితాన్ని అంధకారం చేసుకున్న ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూరులోని సౌరిపాళ్యంలో కుమార్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 7 సంవత్సరాల క్రితం పెద్దలు కుదుర్చిన కోయంబత్తూరులోనే నివాసం ఉంటున్న అనితా (26) అనే యువతిని కుమార్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కుమార్, అనితా దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. కుమార్, అనితా దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు.

Illegal affair: భార్యకు కొవ్వు, లాక్ డౌన్ లో భర్త ?, నరాలు జువ్వున  లాగేశాయి, ఇద్దరు ప్రియులతో ? | Illegal affair: Wife killed husband near  Gopichettipalayam in Chennai due to illegal ...

 

అనితా ఆమె భర్తతో కాపురం ఉంటున్న ఇంటికి సుమారు మూడు కిలోమీట్ల దూరంలో ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. అనితా పదేపదే ఆమె పుట్టింటికి వెళ్లి వస్తోంది. నువ్వు పదేపదే పుట్టింటికి వెళ్లి వస్తుంటే చూసేవాళ్లు రకరకాలుగా అనుకుంటారని, నువ్వు పుట్టింటికి వెళ్లడం తగ్గించాలని కుమార్ అతని భార్య అనితాకు చెప్పాడు. భర్త కుమార్ ఎంతచెప్పినా అతని భార్య అనితా మాత్రం పద్దతి మార్చుకోలేదు. ఇదే సమయంలో పుట్టింటి దగ్గర నివాసం ఉంటున్న వ్యక్తితో తన భార్య అనితా అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె భర్త కుమార్ కు తెలిసిపోయింది. ఇదే విషయంలో కుమార్, అనితా దంపతుల మద్య పెద్దగా గొడవలు జరుగుతున్నాయి.

పిల్లలను అమ్మ ఇంటికి పంపించిన అనితా ఆమె భర్త ఇంట్లో ఉంది. ఇంటికి వెళ్లిన కుమార్ అతని భార్య అనితాతో ఆమె అక్రమ సంబంధం విషయంలో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో అక్రమ సంబంధం విషయంలో అనితా, కుమార్ దంపతుల మద్య గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన కుమార్ పదునైన ఆయుధం తీసుకుని అతని భార్య అనితా మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ఆమెను చంపేయాలని ప్రయత్నించాడు. అనితా గట్టిగా కేకలు వెయ్యడంతో చుట్టుపక్కల వాళ్లు విషయం గమనించి ఆమెను కోయంబత్తూరులోని సీఎంసీహెచ్ ఆసుపత్రికి
తరలించారు. భార్య అనితాను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన కుమార్ తప్పించుకుని పారిపోయాడు. విషయం తెలుసుకున్న కోయంబత్తూరు పోలీసులు గాలించి కుమార్ ను అరెస్టు చేశారు. అనితా ఐసీయూలో ఉందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. నా భార్య అనితా అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని, అందుకే చంపేయాలని అనుకున్నానని కుమార్ నేరం అంగీకరించాడని ఓ సీనియర్ పోలీసు అధికారి అంటున్నారు.