రాష్ట్రంలోని 164 ఆదర్శ పాఠశాలల్లో ఆరోతరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సంయుక్త సంచాలకులు రవీంద్రనాథెడ్డి తెలిపారు. ఆరో తరగతి విద్యార్థులు జూన్ 5 నుంచి 16వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, రిజర్వేషన్లు లాటరీ విధానంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పదో తరగతి మార్కులు, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఇంటర్ ప్రవేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఆదర్శ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రస్తుతమున్న 80 సీట్లను వందకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రతి సెక్షన్కు 50మంది చొప్పున పదో తరగతి వరకు రెండు సెక్షన్లు ఉంటాయి. ఇంటర్మీడియట్లో గ్రూపునకు సీట్లను 20నుంచి 40కి పెంచారు. ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అమలు చేయనున్నారు.