ఇంట్లో పాలు పొంగితే.. మంచిదా కాదా..?

-

కొంతమంది ఇంట్లో ఖచ్చితంగా పాలు, పెరుగు అనేవి ఉండనే ఉంటాయి. ఇక పాలు మనం కాచే టప్పుడు స్టవ్ మీద ఉంచి ఏదో ఆలోచిస్తూ వేరే పనిలో పడి పోతూ ఉంటాము. అలా స్టౌ మీద పెట్టిన పాలను మనం మరచి పోవడం వల్ల పాలు పొంగి పోతుంటాయి లేదా బాగా మరిగి పోయి పనికి రాకుండా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా పాలు పొంగడం ని మాత్రం కొందరు అశుభంగా అనుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం వీటిని శుభంగా పరిగణిస్తూ ఉంటారు. అసలు పాలు పొంగడం అనేది మంచిదా కాదా అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.

తూర్పు దిక్కున ప్రతి ఒక్కరూ శుభం గా భావించి ఆ దిక్కున ఎక్కువగా పాలు పొంగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా గృహప్రవేశం చేసేటప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు.. ఈ విధంగా చేయడం వల్ల అదృష్టం ఆరోగ్యం ,శాంతి ,సంపద లభిస్తాయని అందరూ భావిస్తూ ఉంటారు. తూర్పు దిక్కు నుండి వెలువడే పాజిటివ్ ఎనర్జీ వల్ల అదృష్టం కలుగుతుందని ఎక్కువగా ఆ దిక్కునే పొంగించే ఆచారం ఎన్నో ఏళ్ళ నుండి వస్తూనే ఉన్నది.

అయితే పాలు పొంగించడం అనేది కొంతమంది మంచిది కాదు అంటారు మరి కొంతమంది మంచిదని అంటూ ఉంటారు.. అయితే పాలు పొంగడం శుభ పరిమాణానికి సంకేతమని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. పాలు సంపదలకు, సమృద్ధి కి సంకేతము అలాగే.. ఆవు పాలతో పాలు పొంగించడం, యజ్ఞాలు చేయడం, ఏదైనా దైవ కార్యక్రమాలు ఉపయోగించడం వల్ల.. అంతా మంచి జరుగుతుందనే నమ్మకం మనకి ఉంది. అందుచేతనే పాలు పొంగించడం కూడా మంచిదే అని చెప్పవచ్చు. పాలు పొంగాయంటే ఖచ్చితంగా ధన లాభం వస్తుందని పండితులకు తెలియ జేస్తున్నారు. ఏది ఏమైనా పాలు పొంగిన అనుకోకుండా పొంగినా కూడా అది చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news