శంషాబాద్ లోని 3 పబ్బులపై NSUI కార్యకర్తల దాడులు

-

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని మూడు పబ్బులపై ఎన్ఎస్ యుఐ కార్యకర్తల దాడులు చేశారు. ఓ పక్క యువతులపై రేప్ సంఘటనలు జరుగుతుంటే మరో మక్క తెల్లవారే దాక పబ్బులను నడుపుతూ యువతి, యువకుల ప్రాణలతో చలగాటం అడుతున్నారని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ భల్మూరి అన్నారు. హైదరాబాద్ లో పబ్ లకు అర్దరాత్రి 12 వరకే పర్మీషన్ ఉండడం వల్ల అర్దరాత్రి 12 దాటిన తరువాత ఎయిర్ పోర్ట్ కు వచ్చి పీకలదాకా మద్యం సేవించి యువతులపై లైంగిక ధాడులు చేస్తే బాధ్యత ఎవరిధి అని యాజమాన్యాని ప్రశ్నించారు.

ఎయిర్ పోర్ట్ లో అర్దరాత్రి మూడు దాటిన నడుపుతున్న బెర్లీ అండ్, బఫెల్లో వైల్డ్ వింగ్స్ మరియు SPOSKY పబ్ లప్ ధాడులు నిర్వహించి మైనర్ లు మద్యం సేవించడం ఆధారాలతో సహా యాజమాన్యం ముందు పెట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కేవలం ప్రయాణికులకు మాత్రమే పబ్ లోకి అనుమతించాలి తప్ప భయటవ్యక్తులను కాదని తెలిపారు. మూడు రోజుల క్రితం యువతిపై మద్యం మత్తులో అత్యాచారం జరిగిన విషయం తెలిసి కూడా తెల్లావారుజాము వరకు పబ్ లను నడుపుతూ యువతను చెడు మార్గంలో పెడుతున్నారని తెలిపారు. సంబంధిత శాఖ మంత్రులు కెటిఆర్ ఎయిర్ పోర్ట్ లోని మూడు పబ్ లపై చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున అందోళనకు దిగుతామని హెచ్చరించారు.‌

Read more RELATED
Recommended to you

Latest news