దేశంలో 70 శాతం మందికి సరైన ఆహారం లేదట.. గణాంకాలు చెబుతున్న చేదు నిజాలు..!

-

దేశ జనాభా పెరుగుతుంది.. నిత్యవసరాల ధరలు కొండెక్కుతున్నాయి. మన దేశంలో 70 శాతం మందికి సరైన ఆహారం లేదు. ఆహారం లేక ఏటా ఎంతోమంది చనిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. దేశంలోని 17 రాష్ట్రంలోని నగరాల కంటే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ గ్రామాల్లో ఆహార ధరలు ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది.

పోషకాహార లోపం..

కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి.. ప్రపంచ దేశాల ఆర్ధిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపించిది. పేద దేశాలు మరింత పేద దేశాలుగా మారాయి. మొత్తం ప్రపంచ జనాభాలో 42శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారతదేశంలో అయితే 71శాతం మంది ప్రజలకు సరైన పోషకాహారం లభించడం లేదట. ఫలితంగా మధుమేహం, శ్వాసకోశ వ్యాధి, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ఆహార-ప్రమాద సంబంధిత వ్యాధులతో ఏటా 1.7 మిలియన్ల మంది మరణిస్తున్నారని పలు గణాంకాల ద్వారా తేలింది.

ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు లేకపోవడంతో పాటు.. ప్రాసెస్ చేసిన మాంసం, ఎర్ర మాంసం, చక్కెర పానీయాలు అధికంగా ఉండటం వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారని..సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) ‘స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్విరాన్‌మెంట్’ నివేదిక చెబుతుంది. ఆహార వ్యవస్థలు, పద్ధతులు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు పాల ఉత్పత్తి అతిపెద్ద సహకారం. అదనంగా ధాన్యాల ఉత్పత్తిలో నీరు, నత్రజని, భాస్వరం ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లోనే అధిక ధరలు..

ఆహార పదార్థాల ధరలను కూడా నివేదిక విశ్లేషించింది… గత ఏడాది వినియోగదారుల ఆహార ధరల సూచిక 327% పెరుగుదలను నమోదు చేయగా.. వినియోగదారుల ధరల ఇండెక్స్ 84% పెరిగింది. మార్చి, ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, తమిళనాడు వంటి 17 రాష్ట్రంలోని నగరాల కంటే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ గ్రామాల్లో ఆహార ధరలు ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది.

బీహార్, కర్నాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ నగరాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఆహార రంగంలో దేశం పురోగమిస్తోంది కానీ..ఆహారం ఆరోగ్యకరంగా ఉండడం లేదని నిపణులు అంటున్నారు.. దేశంలో పోషకాహార లోపం తీవ్ర స్థాయిలో ఉంది… మన దేశంలో దాదాపు మూడొంతుల మందికి సరైన పోషకారం లేక..వ్యాధుల బారిన పడుతూ.. ఏటా 17 లక్షల మంది మరణిస్తున్నారట.

ప్రతి ఒక్కరికి.. తమ ఆహారం పై ప్రత్యేక శ్రద్ద ఉండాలి. వారంలో నాలుగు రోజులు అయినా.. ఆకుకూరలు, పండ్లు, రసాలు, విటమిన్స్‌ ఉండేవి తీసుకోవాలి. జంక్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. పెరట్లో ఖాళీ ఉంటే.. ఇంట్లోనే కూరగాయలు పెంచుకునే ఏర్పాటు చేసుకోవాలి. పురుగుల మందులు వాడని కూరగాయలు తినటం చాలా మంచిది. బయట ఎలాగూ ఆ అవకాశం లేదు కాబట్టి.. వీలుంటే.. ఇంట్లోనే పెంచుకోవడం మంచిది.!

Read more RELATED
Recommended to you

Latest news