నేనెప్పుడూ ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేయలేదు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

-

నేనెప్పుడూ ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేయలేదు. కక్షలతో రగులుతున్న వారి మధ్య రాజీ కుదిర్చి.. ప్రతి గ్రామంలో అభివృద్ధి చేయటానికి నా వంతు కృషి చేస్తున్నానని తెలిపారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు కంచర్ల జాలయ్య వైఎస్సార్‌సీపీకి చెందిన గుడిపాటి వెంకట్రామయ్యను హత్య చేశారు. అయినా ఫ్యాక్షన్‌ రాజకీయాలు వద్దని నచ్చజెప్పి అదే కేసులో మొదటి ముద్దాయి అయిన కంచర్ల జాలయ్యను, పార్టీకి చెందిన వారిని పిలిచి రాజీచేశానని వివరించారు.

అందుకు భిన్నంగా మాజీ సీఎం చంద్రబాబు, లోకేష్ కలిసి మాచర్ల నియోజకవర్గంలో ఏడుగురి హత్య కేసులలో నిందితుడైన జూలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్‌చార్జిగా నియమించారు.. అప్పటినుంచే నియోజకవర్గంలో గొడవలు జరుగుతున్నాయన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో అభివృద్ధి పనులు జరిగాయి. ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఆగిపోయాయి.

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తిరిగి అరాచకాలు పెరిగాయని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పల్నాడులో అనేక గ్రామాల్లో ఫ్యాక్షనిజం పెరిగిందని ఫైర్ అయ్యారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అలజడులు సృష్టించి, గొడవలు చేసి, హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దొంగతనాలు చేసిన వారిని ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తూ ప్రతి చిన్న ఘటనను భూతద్దంలో చంద్రబాబు చూపుతున్నారని ఫైర్ అయ్యారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news