ద్రోణునికి ధనుర్విద్యను నేర్పింది ఎవరో తెలుసా!

-

సకలవిద్యా సంపన్నుడు ద్రోణాచార్యుడు. కురువఋద్దులలో పేరుగాంచినవారిలో ద్రోణాచార్యులు ఒకరు. ఇతని తండ్రి భరద్వాజముని. భారద్వాజుని చేత ఇతడు ద్రోణం (బాల్చి)లో పెంచడం చేత ఇతనికి ద్రోణుడని పేరువచ్చింది.

ద్రోణుడు,ద్రుపదుడు ఇద్దరు సహాధ్యాయులు. వీరిద్దరికి విద్యను నేర్పింది ద్రోణుడి తండ్రియైన భరద్వాజుడు. అనంతర కాలంలో ద్రుపదుడు పాంచాలదేశానికి రాజు అవుతాడు. ద్రోణుడు దరిద్రుడు. అందుచేత కుటుంబ పోషణ కోసం ధనాన్ని సంపాదించాలనుకుంటాడు. జమదగ్ని కుమారుడైన పరుశరాముడు బ్రాహ్మణులకు ఎడతెగకుండా ధనాన్ని దానం చేస్తున్నాడని విన్నాడు. వెంటనే మహేంద్ర పరత్వంపైన తపస్సు చేసుకుంటున్న పరుశరాముడి దగ్గరకి ద్రోణుడు వెళ్తాడు. ద్రోణుని చూసిన పరుశరాముడు చూసి వచ్చిన పని ఏమి అని అడుగుతాడు. దానికి జవాబుగా ద్రోణుడు తన బీదరికాన్ని చెప్పుకొని ధనభిలాష విన్నవించుకున్నాడు.

అతనికోరిక విన్న పరుశరాముడు ఖిన్నుడై అంతకు ముందే తన దగ్గరున్న ధనాన్నంతా బ్రాహ్మణులకు, మిగిలిన భూమినంతా కశ్యప్రజాపతికి ఇచ్చానని చెప్పుతాడు. ఇంకా తన వద్ద తన శరీరం, ధనుర్విద్య మిగిలి ఉన్నాయి ఏదో ఒకటి కోరుకోమన్నాడు. అప్పుడు ద్రోణుడు ఆలోచించి తనకు ధనుర్విద్యను ప్రసాదించమన్నాడు. ధనుర్విద్యలో అద్వితీయమైన ప్రజ్ఞ కల పరుశరాముడు తన విద్యను పూర్తిగా ద్రోణునికి నేర్పిస్తాడు. పరుశరాముని దగ్గర ఎన్నో దివ్యాస్ర్తాలు, వాటిని ప్రయోగించడంలో గల రహస్యాలు, వాటికి సంబంధించిన మంత్రాలను, ప్రయోగం, ఉపసంహరాలు అన్నింటిని సంపూర్ణంగా ద్రోణుడు అభ్యసిస్తాడు. ఇప్పుడు అర్థమైందా… విలువిద్యలో అర్జునుని, ఏకలవ్యుడి వంటి శిష్యులను కలిగిన ఆచార్యుడికి ఆచార్యుడు ఎవరు అంటే పరుశరాముడు. ద్రోణుడిని సకల అస్త్రశస్త్ర, ధనుర్విద్యా సంపన్నుడుగా మార్చిన మహాబలశాలి పరుశరాముడు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news