తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. జగ్గారెడ్డి కారెక్కడం ఖాయమేనట..!

తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగలబోతోంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కారెక్కడం ఖాయమైపోయిందట. ఇదివరకే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరుతారని తెలిసినా.. మళ్లీ ఏమైందో కానీ.. ఆ ఊసే ఎత్తలేదు. తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌ను పొగడటం లాంటివి చేయడంతో జగ్గారెడ్డి.. ఖచ్చితంగా టీఆర్‌ఎస్‌లో చేరుతారని అంతా అనుకున్నారు.

తర్వాత మళ్లీ ఏమైందో కానీ.. టీఆర్‌ఎస్ గురించే మాట్లాడలేదు ఆయన. ఆ తర్వాత.. చంద్రబాబు, జగన్, కేసీఆర్ యూపీఏకు మద్దతు ఇస్తారని.. ఈసారి యూపీఏ గెలుస్తుందని ఏదేదో మాట్లాడారు. అవన్నీ పక్కన బెడితే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి టీఆర్‌ఎస్‌లో జగ్గారెడ్డి చేరడం కన్ఫమ్ అయిందట.

ఆయనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో.. టీఆర్‌ఎస్‌లోకి రావాలంటూ.. కేసీఆర్, కేటీఆర్ బంధువులు తనను ఆహ్వానించారంటూ ఆయన తెలిపారు. అయితే.. తాను గాంధీ భవన్‌లో ఉంటానో లేక తెలంగాణ భవన్‌లో ఉంటానో కొన్ని రోజుల్లో తెలుస్తుంది అని ఆయన పెద్ద బాంబు పేల్చేసరికి.. నో డౌట్.. జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైనట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.