మనుషులకు ఏదైనా రోగాలు వస్తే హాస్పిటల్ కు వెళ్తారు.అలాగే జంతువులు ,పక్షులకు ఏదైనా జబ్బు చేస్తే వాటికి సంభందించిన ఆసుపత్రికి తీసుకెళ్తారు..ఇక ఏదైనా వస్తువు పాడైపోయిన రిఫైర్ షాప్ తీసుకెళ్ళి బాగు చేయిస్తారు.అదే పెన్నులకు ఏదయినా వస్తే దాన్ని పడేసి కొత్త పెన్ను కొనుక్కొవడం చేస్తారు.కానీ అలా పాడైన పెన్నులను బాగు చేయడానికి ఒక ప్రత్యెకమైన ఆసుపత్రి ఉందట..ఏంటి నిజమా అని ఆశ్చర్య పోకండి మీరు విన్నది అక్షరాల నిజం..పురాతన పెన్నుల నుంచి భారీ ధర పెట్టి కొన్న పెన్నులను సైతం అక్కడ రిఫైర్ చేస్తారట..ఆలస్యం లేకుండా ఆ హాస్పిటల్ రహస్యం ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం..
ఈ ‘పెన్ ఆసుపత్రుల’కు కోల్‌కతా నగరం కేరాఫ్‌గా మారింది. అలాంటి చాలా ఆస్పత్రులు కాలక్రమేణా కనుమరుగైనా కోల్‌కతా నడిబొడ్డున మాత్రం ఒక పెన్ హాస్పిటల్ ఇప్పటికీ దర్పం ఒలకబోస్తోంది. ఇక్కడకు వచ్చే పాత, విరిగిన పెన్నులను డాక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ చక్కగా ట్రీట్ చేస్తాడు. ఇంతియాజ్ తాత సంసుద్దీన్ 1945లో ఈ ఆస్పత్రిని ప్రారంభించగా, రెండు తరాల నుంచి కొనసాగిస్తున్నారు. విదేశాలకు చెందిన వాటర్‌మన్, షెపర్డ్, పియరీ కార్డా, విల్సన్ వంటి రాయల్ పెన్నులు ఇక్కడ విక్రయించేవాళ్లు. కానీ అంత ఖరీదైన పెన్నులు పాడైపోతే రిపేర్ చేసే వాళ్ళు లేక బాధపడేవాళ్లు. దీంతో తమ తమ సంసుద్దీన్ స్వయంగా వాటిని రిపేర్ చేయడం మొదలుపెట్టడంతో పెన్ హాస్పిటల్ ప్రయాణం మొదలైందని నిర్వాహకుడు తెలిపారు.
20 నుంచి రూ. 20,000 వరకు పెన్నులు ఉన్నాయి. వివిధ పరిమాణాలు, ఆకారాలకు సంబంధించిన భిన్నమైన పెన్నులు, వాటి ముల్కీలు ఉపయోగించి విరిగిన పెన్నులకు ‘వైద్యం’ చేస్తున్న ఇంతియాజ్.. వాటికి కొత్త జీవితాన్ని పోస్తున్నాడు. సుదీర్ఘమైన ఇలస్ట్రేటెడ్ చరిత్రలో అనేక మంది ప్రసిద్ధ ప్రొఫెసర్లు, రచయితలు, జర్నలిస్టులు తమకు ఇష్టమైన పెన్నుల రిపేర్ కోసం ఈ పెన్ హాస్పిటల్‌కు రావడం విశేషం..కొంత మంది ఫ్యాషన్ పేరుతో పాత పెన్నులు కొనుగోలు చేస్తారు. ఇక విదేశీ పెన్నులు చాలా ఖరీదైనవి. ఇప్పటికి కూడా రూ.10,000-12,000 విలువ చేసే పెన్నులను రిపేర్ కోసం నా దగ్గరకు తీసుకొస్తుంటారు. పెన్ నిబ్ నుంచి ఇంక్ ఫిల్లింగ్ సిస్టమ్.. ఒక్కో పెన్నుకు భిన్నంగా ఉంటుంది…మొత్తానికి అక్కడికి వెళ్ళిన పెన్ను మునుపటి లాగే పని చేస్తుంది.వావ్ ఇలాంటి ఆలోచన అందరికి రాదు..గ్రేట్ కదా..