వీడియో: అసభ్యంగా ప్రవర్తించడానికి ట్రాఫిక్ ఎస్ఐను చితకబాదేశారు!

-

దక్షిణ ఢిల్లీ సంగమ్ విహార్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేస్తుండగా.. స్థానిక ట్రాఫిక్ ఎస్ఐతో కొందరు వాగ్వాదానికి దిగారు. ప్రజలు ఒక్కసారిగా ఎస్ఐపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటన్న విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అయితే, ఓ యువతి.. ట్రాఫిక్ ఎస్ఐ కాలర్ పట్టుకుని చెంపలు చెళ్లుమనిపించింది. దీని ఆధారంగా చూస్తే ఆ ఎస్ఐ యువతితో అసభ్యంగా ప్రవర్తించి ఉన్నట్లు సమాచారం.

Traffic_Cop_Delhi_Attack
Traffic_Cop_Delhi_Attack

యువతితోపాటు మరో యువకుడు, యువతి అతనిపై దాడికి దిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ మేరకు ట్రాఫిక్ ఎస్ఐను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి టిగ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన యువతి.. ఎస్ఐ తనపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించింది. అయితే ఘటనా స్థలంలో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది ఎస్ఐని రక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news