అందరు పిల్లలు ఒకలా ఉంటారని అనుకోవడం అసాద్యము..మన చేతి వేళ్ళు ఎలా అయితే సమానంగా ఉండవో..అలానే విద్యార్థుల మనస్తత్వం కూడా వుంటుంది. అందరూ మెరిట్ తెచ్చుకోవాలంటే మాత్రం తెచ్చుకోలేరు.అలాంటి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల్లు ప్రత్యేక శ్రద్దను చూపించాలి.ఎలా చెస్తె వాళ్ళు బాగా చదువుతారో ఆలొచించాలి.అంతేకానీ నువ్వు ఎందుకు పనికి రావు నువ్వు ఇంతే, పెద్ద సుద్ద మొద్దువు అని నిందించడం సరికాదు. అలా పదిమంది ముందు అంటే ఆ పిల్లలు ఇంకాస్త మానసికంగా క్రుంగిపోతారు..అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.
ఓ విద్యార్థిని అతని ఉపాధ్యాయుడు నువ్వు ఇంతే జీరో..నీకు చదువు రాదు అని ఒక అవార్డును తగిలించాడు.ఆ విషయం ఆ కొడుకు తల్లికి చెప్పాడు. ఆమె ఎందుకు అలా అన్నాడు అని చాలా సార్లు ప్రయత్నించింది కానీ స్కూల్ యాజమాన్యం మాత్రం ఏది చెప్పలేదు..ఈ ఘటన USలోని మిస్సిస్సిప్పిలోని లీక్ కౌంటీలో వెలుగు చూసింది.బక్లీ తన 14 ఏళ్ల కొడుకు బ్రాడ్లీని పాఠశాల నుండి తీసుకువెళ్లినప్పుడు ఏదో తప్పు జరిగిందని తెలిసింది.అతను సిగ్గుపడినట్లు కనిపించాడు. తల్లి మిస్సిస్సిప్పి TV నెట్వర్క్ WAPTకి పిల్లాడి స్థితి గురించి వివరించింది.
బ్రాడ్లీ తన ఉపాధ్యాయుడి నుండి “భయంకరమైన అవార్డు” అందుకున్నాడు: “‘జీరో’ అవార్డు పై చాలా భాధపద్దాడు.అయితే ఆ విషయాన్ని తల్లికి చెప్పాడు. ఆమె దాన్ని విని బాధ పడింది..అతన్ని ఎందుకు అలా అన్నారో కనుక్కోవాలని చాలా ట్రై చేసింది.బ్రాడ్లీకి మాత్రమే కాదు, ఏ బిడ్డకైనా,” ప్యాట్రిసియా చెప్పింది.
తన లీక్ కౌంటీ స్కూల్స్ సూపరింటెండెంట్‌తో చాలాసార్లు మాట్లాడానని, అయితే ఇంకా ఎలాంటి పరిష్కారాలు వినలేదని ఆమె అన్నారు. దాంతో విసిగి పోయిన ఆమె పిల్లాడిని వేరే స్కూల్ లో చేర్చాలని అనుకుంది.. అతడు మాత్రం అదే స్కూల్ కు వెల్లాలని అనుకున్నాడు.. ఈ విషయం విన్న వాళ్ళు అతని పై జాలి చూపించారు..ఇలాంటి స్కుల్స్ ఉన్నంతవరకు ఇలానే పిల్లల భవిష్యత్తు ఆగిపోతుందని విమర్శలు గుప్పిస్తున్నారు.