Breaking : విద్యార్థులకు శుభవార్త.. ఐఐటీల్లో బీఈడీ కోర్సు

-

బీఈడీ కోర్సులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఐఐటీల్లోనే బీఈడీ కోర్సులు నిర్వహించాలని కేంద్రం అడుగులు వేస్తోంది. అయితే.. దేశంలో అనేక బీఈడీ కాలేజీలు ఆశించిన ఫలితాలు అందించలేకపోతున్నాయని, వాటి పనితీరు నాసిరకంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో, నాణ్యమైన విద్యకు పేరుగాంచిన ఐఐటీల్లో బీఈడీ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

Cabinet Reshuffle: Dharmendra Pradhan becomes India's new Education Minister

దీనికోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ) కు రూపకల్పన చేస్తున్నట్టు వివరించారు ధర్మేంద్ర ప్రధాన్. ఇది నాలుగేళ్ల కాల వ్యవధి కలిగి ఉంటుందని తెలిపారు. భావితరం ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీలు ఉత్తమ విద్యాకేంద్రాలని ధరేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news