ఏపీ విద్యుత్ సమస్యలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ విద్యుత్ కోతలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో విద్యుత్ సరఫరాను, ఏపీలో విద్యుత్ కోతలతో ఆయన పోల్చారు. ఏపీ తో పోలిస్తే తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదన్నారు. దీంతో ఇప్పుడు హరీష్ రావు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ప్రతి విషయంలోనూ తాము బెటర్ అని చెప్పుకునేందుకు ఏపీ తో పోల్చడం తెలంగాణ మంత్రులకు అలవాటుగా మారింది అన్న చర్చ జరుగుతుంది.

తాజాగా తాను తిరుమలలో పర్యటించినప్పుడు అక్కడ దర్శనానికి వచ్చిన వారిని అడిగితే కరెంటు కోతల విషయం బయటపడిందన్నారు హరీష్ రావు. ఏపీలో ఆరు గంటల పాటు కరెంటు కోతలు ఉన్నాయని తెలిపారు. ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు కరెంటు పోతుంది అన్నారు. దీంతో అక్కడ రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు హరీష్ రావు తెలిపారు.

గతంలో ఏపీలోని రోడ్ల దుస్థితి పై కేటీఆర్ వ్యాఖ్యలు చేసినప్పుడు వైసీపీ మంత్రులు, సలహాదారులు అంతా కలిసి తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ ను 24 గంటల్లో క్షమాపణ చెప్పించారు. కానీ ఇప్పుడు హరీష్ రావు ఏపీలో కరెంటు కోతలు పై చేసిన వ్యాఖ్యలపై మాత్రం వైసీపీ మంత్రులు ఇంకా స్పందించలేదు. ఎన్నికల వేళ టిఆర్ఎస్ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి ఇబ్బంది గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news