నిజామాబాద్‌లో దారుణ ఘటన.. మైనర్ బాలికపై అత్యాచారం..!!

-

నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలికపై అత్యాచారం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 31వ తేదీన నిజామాబాద్ పట్టణంలో భవనంపై నుంచి ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బాలికకు తీవ్ర గాయాలు అయ్యారు. ఆస్పత్రిలో జాయిన్ చేసి 14 రోజులపాటు చికిత్స అందించారు. అనంతరం ఆత్మహత్య యత్నించడానికి కారణమేంటని తల్లిదండ్రులు అడగగా.. యువకుడి విషయం చెప్పింది. ఓ యువకుడు తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాలిక పేర్కొంది.

దీంతో బాలిక తల్లిదండ్రులు నిజామాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో, అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడి పరారీలో ఉన్నాడని, త్వరలో అతడిని పట్టుకుని అరెస్ట్ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news