భూమా ఫ్యామిలీకి సీటు గండం..ఎవరికి హ్యాండ్ ఇస్తారో?

-

ఏపీ రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి అంటూ ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది..ముఖ్యంగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది..దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు అనేక ఏళ్ళు కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు…ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో తిరుగులేని విజయాలు అందుకున్నారు…టీడీపీలో ఆ తర్వాత ప్రజారాజ్యంలో..నెక్స్ట్ వైసీపీలో అద్భుత విజయాలు అందుకున్నారు.

ఇక శోభా నాగిరెడ్డి చనిపోయాక…ఆమె తనయురాలు అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు…నాగిరెడ్డి చనిపోయాక..భూమా ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా అఖిలప్రియ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో అఖిలప్రియ ఘోరంగా ఓడిపోయారు….ఆళ్లగడ్డ బరిలో ఓటమి పాలయ్యారు..అటు నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి సైతం ఓడిపోయారు. ఇలా భూమా ఫ్యామిలీ ఘోరంగా ఓడిపోయింది….అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని ఇటు అఖిల..అటు బ్రహ్మానందరెడ్డి కష్టపడుతున్నారు. ఓడిపోయిన దగ్గర నుంచి తమ తమ నియోజకవర్గాల్లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు.

అయితే రెండు నియోజకవర్గాల్లో వైసీపీ స్ట్రాంగ్ గానే ఉంది…ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల…టీడీపీకి బలపడే అవకాశం దొరకడం లేదు. ముఖ్యంగా నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి కష్టపడుతున్నారు..కానీ పూర్తి స్థాయిలో పికప్ కాలేకపోతున్నారు..దీంతో ఆయన బలం సరిపోవడం లేదని తెలుస్తోంది. ఇక్కడ వైసీపీలో బలంగా ఉన్న శిల్పా ఫ్యామిలీని తట్టుకోవడం బ్రహ్మానందకు సాధ్యమయ్యేలా లేదు.

దీంతో దివంగత నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుందని టీడీపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నంద్యాలలో ఎస్పీవై రెడ్డి ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్ ఉంది..అయితే భూమా ఫ్యామిలీని కాదని వేరే వాళ్ళకు టికెట్ ఇస్తారో లేదో చూడాలి. అటు ఆళ్లగడ్డలో అఖిలప్రియ యాక్టివ్ గానే ఉన్నారు…కాకపోతే ఈ సీటులో పోటీ చేయడానికి అఖిల సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి చూస్తున్నారు…అయితే తన తమ్ముడుకు అప్పుడే పోటీ చేసే సమయం రాలేదని, రానున్న రోజుల్లో విఖ్యాత్ కు ఛాన్స్ ఉంటుందని అఖిలప్రియ చెబుతున్నారు…కానీ టీడీపీ అధిష్టానం ఎలా ఆలోచిస్తుందో క్లారిటీ లేదు…మొత్తానికి నెక్స్ట్ ఎన్నికల్లో భూమా ఫ్యామిలీలో ఎవరోకరి సీటు గల్లంతయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news