ఆంధ్ర కంటే రెట్టింపు వరి పంట తెలంగాణలో పండిందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేశారు. మార్కెట్ వ్యవస్థ కెసిఆర్ వచ్చాక చాలా బలోపేతం అయిందని వెల్లడించారు. మార్కెటింగ్ వ్యవస్థలో రిజర్వేషన్స్ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అధ్బుతంగా రాణిస్తున్నారు… ఈ మార్కెట్ కమిటీ మహిళ కు కేటాయించారని తెలిపారు.
గత ప్రభుత్వాలు గోడౌన్ ల కోసం అలోంచించిన దాఖలాలు లేవని.. దేశానికి అన్నం పెట్టే ధాన్య గారంగా తెలంగాణ మారిందని చెప్పారు. పంట పండడం వల్ల ధాన్యం మోయడానికి కూలీలు దొరకని పరిస్థితి ఉందని.. ఇతర రాష్ట్రాల నుండి కూలీలు వస్తున్నారని వివరించారు. పదవి కి 5ఎండ్లు మాత్రమే కానీ పెదవి కి నురెండ్లు ఉంటుందని తెలిపారు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు.