తరువాత ఇదే ఆలోచనను కొనసాగింపు చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ! పోలవరం పనులు పూర్తి చేయడంలో అలసత్వం నెలకొనడంతో ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో కూడా చెప్పలేం అని నిపుణులు చేతులెత్తేస్తున్నారు. పనులు పూర్తయితే ఇచ్ఛాపురం వరకూ తాగు, సాగు నీటి సమస్యలు ఏకకాలంలో తీరుతాయి. అదేవిధంగా ఎందరికో ఉపాధి అవకాశాలు, సాగుయోగ్యత పెరగడం వంటివి తప్పక జరుగుతాయి. మొదట్లో అంటే వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్టు అంచనా ఏడు వేల 214 కోట్ల రూపాయలే ! తరువాత పనులు ఆగిపోవడంతో 2009 నుంచి ఇప్పటిదాకా అదే విధంగా ప్రతిష్టంభన నెలకొని ఉంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అస్సలు ఈ పథకం ఊసేలేకుండా పోయింది.
2017లో దీన్ని రెండు దశలుగా విభజించి తొలి దశలో లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టుకునీరివ్వాలని భావించారని కానీ అది కుదరకుండా పోయిందని ప్రధాన మీడియా కథనం వెల్లడి చేస్తోంది ఇవాళ. తొలి మలి దశలు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. ఎలా అనుకున్నా కూడా మారుమూల శ్రీకాకుళం కు సాగు యోగ్యత లేకుండానే పోయింది. ఆశించిన రీతిలో అటు వంశధార కూడా పనులు నత్తనడకగానే ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్నా ఉత్తరాంధ్ర రైతుకు నష్టమే!