జై భారత్ కార్యకర్తల ధ్యాన సమాలోచన సమావేశం

-

హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని జైభారత్ జాతీయ కార్యాలయంలో నేడు తెలంగాణ రాష్ట్ర కార్యకర్తల ధ్యాన సమాలోచన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఖదిజ్ఞాసి రమణమూర్తి, జాతీయ కార్యదర్శులు రజిని, లోక్‌నాథ్, సత్యం, జైహో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మేశ్వర్ దున్న, బీసీ పోరాట వేదిక అధ్యక్షులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

జైహో సమావేశం
జైహో సమావేశం

ఈ సందర్భంగా ఖదిజ్ఞాసి రమణమూర్తి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో నిర్వహించబోయే సమావేశాలు, నిర్వహణ కార్యక్రమాలపై చర్చించారు. ఈ మేరకు సమావేశంలో పలు ముఖ్య అంశాలపై, రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, ఆరోపణలపై మాట్లాడారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి ఖదిజ్ఞాసి దీక్షను అప్పగించారు.

అన్నమయ్యకు అపచారం..

2003లో అన్నమయ్య నివాసాన్ని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కూల్చివేసింది. అలాగే ఆంజనేయ స్వామి మండపాన్ని 2007లో కూల్చివేసింది. ఈ మేరకు సనాతన సమధర్మ ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు, జైహో జాతీయ అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ విజయ శంకర స్వామి.. కూల్చేసిన అన్నమయ్య ఇంటిని పునఃప్రతిష్టించాలని, మండపాన్ని టీటీడీ నిర్మించాలని డిమాండ్ చేశారు.

జైహో సమావేశం
జైహో సమావేశం

జూన్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియమ్‌ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అన్నమయ్య గృహ సాధన సమితి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని ఆలయ ధర్మకర్తలు, పూజారులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news