హింస అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందే : సాయిపల్లవి

-

ఇటీవల నటి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయ తెలిసింది. కొందరు సాయిపల్లవిని తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు. అయితే దీనిపై తాజాగా సాయిపల్లవి స్పందిస్తూ వివరణతో ఓ వీడియో రిలీజ్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు సాయిపల్లవి. ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్న సాయిపల్లవి.. తాను మాట్లాడిన మాటల్లో కొన్నింటినే పరిగణనలోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు. మీరు రైట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? లెఫ్ట్ వింగ్ కు మద్దతు ఇస్తారా? అని ప్రశ్నించారని, ముందు మనం మంచి మనుషులుగా జీవించాలన్న ఉద్దేశం వచ్చేట్టు సమాధానం ఇచ్చానని స్పష్టం చేశారు సాయిపల్లవి. కానీ, తాను చెప్పిన విషయాలను తప్పుగా అర్థం చేసుకుని ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సాయిపల్లవి.

Sai Pallavi Clarification After Kashmir Files Remark Controversy: "Will  Think Twice Before I Speak My Heart"

హింస అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని సాయిపల్లవి ఉద్ఘాటించారు. తాను మొదట ఓ డాక్టర్ నని, ప్రాణం విలువ తనకు తెలుసన్న సాయిపల్లవి.. ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు తనను క్షమించాలని సాయిపల్లవి అన్నారు. గత కొన్నిరోజులుగా తనపై వస్తున్న విమర్శల పట్ల స్పందించడానికి చాలా ఆలోచించాల్సి వచ్చిందని, తన మాటలు ఎవరినీ బాధించకూడదనే భావిస్తానని స్పష్టం చేశారు సాయిపల్లవి.

 

Read more RELATED
Recommended to you

Latest news