BREAKING : సీఎం జగన్ ను కలసిన డీఎస్సీ1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు

-

BREAKING : సీఎం జగన్ ను డీఎస్సీ1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు కలిశారు. ఉద్యోగాలు ఇవ్వడం పై సీఎం కు ధన్యవాదాలు తెలిపిన డీఎస్సీ98 అభ్యర్థులు..ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ98లో అర్హత పొందిన వారికి ఉద్యోగం ఇస్తామని పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారని.. 24 ఏళ్లనుంచి ఉన్న సమస్యను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే విస్వాసాన్ని నిలబెట్టుకున్నారన్నారు.

నమ్ముకున్న వారికి సీఎం జగన్ న్యాయం చేసి నమ్మకాన్ని నిలబెట్టారు.. 1998 డీఎస్సీ అభ్యర్థులు సీఎం జగన్ కు రుణపడి ఉంటారని చెప్పారు.గత ప్రభుత్వం 98 డీఎస్సీ వారికి అన్యాయం చేసిందని.. సీఎం జగన్ మాకు న్యాయం చేశారన్నారు డీఎస్సీ1998 అర్హత పొందిన అభ్యర్థి సోమశేఖర్. మాకు ఉద్యోగాలు ఇప్పించడంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఎంతో కృషి చేశారని.. సీఎం జగన్ మాకు ప్రాణదాత, వారికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. 24ఏళ్ల సమస్యను సీఎం జగన్ నెరవేర్చారని.. 4567 మంది కుటుంబాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారన్నారు.. దిక్కులేక రోడ్ల పై తిరుగుతున్న మాకు ఉద్యోగాలు ఇచ్చారని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news