రాయలసీమ అంటే జగన్ అడ్డా అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు…మొదట నుంచి సీమ ప్రజలు వైఎస్సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండగా, తర్వాత జగన్ కు సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ సీమలో వైసీపీ హవా కొనసాగింది. 2014లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉంటే…సీమలో మాత్రం వైసీపీ ఆధిక్యం కొనసాగింది. సీమలోని నాలుగు జిల్లాలు కలిపి మొత్తం 52 సీట్లు ఉండగా, వైసీపీ 30 సీట్లు గెలుచుకోగా, టీడీపీకి 22 సీట్లు దక్కాయి.
ఇక 2019 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు…వైసీపీకి 49 సీట్లు రాగా, టీడీపీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే సీమ ప్రజలు వైసీపీ వైపు ఎలా నిలబడ్డారో అర్ధం చేసుకోవచ్చు. మరి వచ్చే ఎన్నికల్లో కూడా సీమ ప్రజలు జగన్ వైపే నిలబడతారా? ఈ సారి 49 టార్గెట్ దాటి… 50 సీట్లు గెలుచుకుంటుందా? అంటే అబ్బే కష్టమనే చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో ప్రజలు జగన్ ని ఒక్కసారి చూడాలని అనుకున్నారు. కాబట్టి నెక్స్ట్ ప్రజలకు ఆ ఆలోచన ఉండకపోవచ్చు.
పైగా జగన్ మీద అభిమానం ఉన్నా సరే..వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు వల్ల వైసీపీ లీడ్ మారిపోయేలా ఉంది. నిజానికి సీమలో జగన్ పై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు..కానీ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై మాత్రం వ్యతిరేకత కనిపిస్తోంది. సీమలో సగానికి సగం మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది.. గడప గడపకు వెళుతున్న ఎమ్మెల్యేలని ప్రజలు నిలదీస్తున్నారు.
అంటే ఇక్కడ జగన్ మిస్టేక్ లేకపోయినా సరే…ఎమ్మెల్యేల మిస్టేక్ వల్ల వైసీపీ లీడ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద సీమలో వైసీపీకే లీడ్ ఉండొచ్చు…కానీ 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్లు మాత్రం రావడం కష్టమే. అదే సమయంలో టీడీపీ కొంతవరకు మెరుగైన ఫలితాలు రాబట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ సారి సీమలో వైసీపీ లీడ్ మారేలా ఉంది.