మాస్ మహారాజా రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ” చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఎప్పటి నుంచో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తుండగా సరైన రిలీజ్ డేట్ కుదరకపోవడంతో సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. జనవరిలో రిలీజ్ డేటు అనుకున్న సినిమాను కాస్త తర్వాత ఏప్రిల్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా తర్వాత వరుస సినిమాలు ఫిక్స్ కావడంతో “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాను జూన్ 17 న విడుదల చేయాలని భావించారు.
అది కూడా కుదరకపోవడంతో రవితేజ అభిమానులు కాస్త నిరాశ చెందారు. దీంతో చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. జూలై 29న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ అవినీతి రాజకీయ నాయకుల భరతం ఎలా పడ్డాడు అనేదే ఈ సినిమా. ఈ చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ గా నాగచైతన్య ‘మజిలీ’ సినిమా తో పరిచయమైన దివ్యంశ కౌశిక్, రజియా విజయన్ నటిస్తున్నారు.
Duty begins from JULY 29th ! See you at the theatres 🙂#RamaRaoOnDuty #RamaRaoOnDutyOnJULY29 😎 pic.twitter.com/SOESJYmrbb
— Ravi Teja (@RaviTeja_offl) June 22, 2022