ఏపీలో అత్యధిక స్థానాలు ఉన్న జిల్లా…ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా…ఈ జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందుకే ఈ జిల్లాపైనే అన్నీ పార్టీలు ఫోకస్ చేస్తాయి…ఇక్కడ మెజారిటీ సీట్లు గెలుచుకుంటే, రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం ఈజీ అని అనుకుంటారు. అయితే ఇప్పటివరకు కూడా అదే జరుగుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో తూర్పులో టీడీపీ మెజారిటీ సీట్లు దక్కించుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది.
ఇక నెక్స్ట్ ఎన్నికల్లో తూర్పులో సత్తా చాటి అధికారం దక్కించుకోవాలని అన్నీ పార్టీలు చూస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ-టీడీపీ పార్టీలు తూర్పుపై గట్టిగా ఫోకస్ చేశాయి. ప్రస్తుతానికి తూర్పులో వైసీపీదే పైచేయి. గత ఎన్నికల్లో ఆ పార్టీ 14 సీట్లు గెలుచుకుంది….టీడీపీ 4 సీట్లు మాత్రమే గెలుచుకోగా, జనసేన ఒక సీటు గెలుచుకుంది. ఇక జనసేన తరుపున గెలిచిన ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వచ్చేశారు. దీంతో వైసీపీ బలం 15కు పెరిగింది.
అయితే ఇవే 15 సీట్లు వైసీపీ మళ్ళీ గెలుచుకోగలదా? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే తూర్పులో వైసీపీ పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు. పైగా టీడీపీ పుంజుకుంటుంది…అలాగే జనసేన సైతం ఇక్కడ వేగంగా పికప్ అవుతుంది. దీంతో వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. కాకపోతే ఇక్కడ వైసీపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే….టీడీపీ-జనసేన గాని విడివిడిగా పోటీ చేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా వైసీపీకే మెజారిటీ సీట్లు దక్కుతాయి.
కాకపోతే గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు రావు….కనీసం 10 సీట్లు అయిన వస్తాయి. అదే టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే మాత్రం తూర్పులో వైసీపీకి రిస్క్ ఎక్కువే. ఆ రెండు పార్టీలు మెజారిటీ సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు వైసీపీ 5-6 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి…లేదా అంతకంటే తక్కువ సీట్లకు పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి టీడీపీ-జనసేన పొత్తు వల్ల వైసీపీకి రిస్క్ ఎక్కువే.