బీఆర్‌ఎస్‌ లేదు.. ఏం లేదు.. వీఆర్‌ఎస్‌ కాకుండా చూస్కో : విజయశాంతి

-

బీజేపీ నాయకులు విజయశాంతి మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తాజాగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనని, మోడీ సభ రోజే… పోటీగా సభ పెడుతున్నారని, ఎంతమంది గుంపులుగా.. గ్రూపులుగా వచ్చినా… మేము సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ లేదు… ఏం లేదు… అంతా ఉత్తిదేనన .. ప్రభుత్వం కావాలనే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. కలర్ బొమ్మలు పెట్టి ఫ్లెక్సీ లు పెట్టగానే టీఆర్‌ఎస్‌ ఏదో చేసినట్టు కాదని వ్యాఖ్యానించారు విజయశాంతి. పనికిమాలిన పనులు చేస్తోంది ప్రభుత్వమని, బీఆర్‌ఎస్‌ లేదు.. ఏం లేదు… టీఆర్‌ఎస్‌ పరిస్థితి వీఆర్‌ఎస్‌ అయితదంటూ సెటైర్లు వేశారు విజయశాంతి . యశ్వంత్‌ సిన్హా కోసం ర్యాలీ పెట్టుకుంటాం అంటే… నేనేం కామెంట్ చేయను.

Vijayashanti's demands to sign in a film shocks everyone

అవి రాష్ట్రపతి ఎన్నికలు… మా సభ రోజే పెట్టుకున్నారు అంటే అది వాళ్ళ ఇష్టమని ఆమె అన్నారు. డబ్బుల ఆశ చూపి… పోలీసులతో బెదిరించి… మభ్య పెట్టి మా కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కేసిఆర్ లాంటి నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని, జాతీయ స్థాయి లో కేసిఆర్ ను ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక్కడ దిక్కు లేదు గానీ జాతీయ స్థాయి లో ఏం చేస్తారని, బీజేపీ సమావేశాలతో టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోందని ఆమె చురకలు అంటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news