కస్టమర్లకు ఎస్బీఐ గుడ్ న్యూస్..త్వరలో కొత్త సర్వీసు..

-

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..దేశంలో కల్లా అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్..ప్రతి చిన్న గ్రామానికి కూడా ఈ బ్యాంక్ సేవలు విస్తరించి ఉన్నాయి.దేశవ్యాప్తంగా 45 కోట్లకు పైగా కస్టమర్లు ఉంటారని అంచనా. కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్ని మరింత దగ్గర చేసేందుకు ఎస్‌బీఐ మరిన్ని చర్యలు తీసుకోబోతోంది. ఎస్‌బీఐ త్వరలో వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందించబోతోంది. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ విషయాన్ని ఎస్‌బీఐ ఛైర్మెన్ దినేష్ ఖారా తెలిపారు. అదే జరిగితే ఎస్‌బీఐ కస్టమర్లు చాలావరకు బ్యాంకు సేవల్ని వాట్సప్ ద్వారా పొందొచ్చు.

గత కొన్ని రోజులలో పలు బ్యాంకులు వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు వాట్సప్ ద్వారా బ్యాకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులన్నీ దాదాపుగా వాట్సప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అందిస్తున్నాయి. ఈ విషయంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ వెనుకంజ లోఉంది.మొత్తానికి ఈ బ్యాంకు కూడా ఆ సేవలను త్వరలో ప్రారంభించనుంది.

ఏపీఐ బ్యాంకింగ్ సిస్టమ్ లాంఛైతే బ్యాంకుకు, క్లైంట్ సర్వర్లకు మధ్య కమ్యూనికేషన్ సులువవుతుంది. రెండు వ్యవస్థల మధ్య డేటా ట్రాన్స్‌ఫర్ ఈజీగా సాగుతుంది. కస్టమర్లకు ఇబ్బందులు లేని, సురక్షితమైన సేవలు లభిస్తాయి. పలు బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేందుకు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సప్ సేవల్ని ఉపయోగించుకోనుంది ఎస్బీఐ. అయితే ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న విషయం ప్రస్తుతానికి తెలియలేదు..ఎస్‌బీఐ కార్డ్ వాట్సప్ కనెక్ట్ సర్వీస్‌ను గతంలోనే ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లు తమ అకౌంట్ వివరాలు, రివార్డ్ పాయింట్స్, ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్, కార్డ్ పేమెంట్స్ లాంటి సేవలన్నీ పొందొచ్చు..వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 08080945040 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. రిజిస్టర్ చేసిన తర్వాత వాట్సప్‌లో 9004022022 నెంబర్‌కు OPTIN అని టైప్ చేసి మెసేజ్ పంపాలి.

Read more RELATED
Recommended to you

Latest news