సీఎం కొడుకు సీఎం కాలేడు.. బిజెపి బలపడుతోంది – కిషన్ రెడ్డి

-

హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. జూలై 2, 3 తేదీల్లో నగరంలోని లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో రహదారులపై ఎక్కడ చూసినా రాజకీయపార్టీల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. మరోవైపు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన నేపథ్యంలో హైదరాబాదులో బిజెపి, టిఆర్ఎస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో రాజకీయ పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం మొదలైంది. తమ పార్టీ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు అంటే మావీ తొలగిస్తున్నారు అంటూ ఇరు పార్టీల నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. టిఆర్ఎస్ పార్టీకి తమ కుర్చీ పోతుందనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. సీఎం కొడుకు ఎప్పటికీ సీఎం కాలేడు అంటూ చురకలంటించారు. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ లో కెసిఆర్ దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news