వానాకాలం ధాన్యం కొంటారా ? కొనరా ? : మోడీని నిలదీసిన గంగుల

-

 

వానాకాలం ధాన్యం కొంటారా ? కొనరా ? అని మోడీ ప్రభుత్వాన్ని మంత్రి గంగుల కమలాకర్ అని నిలదీశారు. బీజేపీ సమావేశంలో ప్రజలకు ఏమి చేస్తారో చెప్పలేదు…కేసీఆర్ ను తిట్టడం తెలంగాణ అభివృద్ధి చూపడం కోసం వచ్చారని ఫైర్ అయ్యారు. బిసి ప్రధాన మంత్రి బీసీల కోసం ఇచ్చిన హామీ నెరవేర్చుతాడాని ఆశపడ్డానని….బీసీ వర్గాలు బాధపడుతున్నాయి..బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలని మంత్రుత్వ శాఖలో ఉండాలని కేసీఆర్ ఆధ్వర్యంలో గతంలో మోడీ ని కలిసి చెప్పామని ఆయన నిలదీశారు.

60 శాతం ఉన్న బిసిలను బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేనని..బీసీ జనగణన కులగణన చేయడానికి ఇబ్బంది ఏంటి ? అని ఫైర్ అయ్యారు.బిసిలకు సంభవించిన కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నాం…బిసిలపై బీజెపి వైఖరి మోడీ బండి సంజయ్ తెలియజేయాలన్నారు. వానాకాలం పంట కొంటారా కొనరా చెప్పండి..మోడీ, ఫియాష్ గోయల్ వచ్చారు ధాన్యం కొనుగోలు చేసిన భారము ఎవరు భరించాలని డిమాండ్ చేశారు.

మిల్లింగ్ కి అవకాశం ఇవ్వరు రా రైస్ కొనరు ఎందుకీ వివక్ష అని..వరి రైతులపై వరి వేసే రాష్ట్రాలపై మోడీ ఎందుకు సమాధానం చెప్పరు అని ప్రశ్నించారు.కరీంనగర్ ఎంపీగా ఒక్క రూపాయి అయినా ఆడిగినవా బండి సంజయ్…నీ నోరు మూడపడటానికి కారణం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు గంగుల కమలాకర్.

Read more RELATED
Recommended to you

Latest news