తిరుమల శ్రీవారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశంలోనే అత్యంత ధనవంతుడు మన శ్రీవారు. నిత్యం భక్తులతో శ్రీవారి ఆలయం కలకలలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు 50 వేలకు పైగానే శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే ఆయన ఉండి ఆదాయం నిత్యం కోట్లలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం… రికార్డు సృష్టించింది.
సోమవారం రోజున శ్రీవారి హుండీ ఆదాయం 6.18 కోట్ల రూపాయలు దాటింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా 6 కోట్ల మార్కును దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. ఇప్పటివరకు 2012 ఏప్రిల్ ఒకటో తేదీన…5.73 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయమే అత్యధికం. అయితే సోమవారం రోజున మాత్రం శ్రీవారి హుండీ ఆదాయం 6 కోట్లు దాటింది. కాగా తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. నిన్న సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టింది.
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,907 మంది భక్తులు.
తలనీలాలు సమర్పించిన 38,267 మంది భక్తులు.
హుండి ఆదాయం రూ.6.18 కోట్లు