ఆ జిల్లాలో బోరుకు కారు..మళ్ళీ కష్టమేనా?

-

ఇప్పటివరకు ప్రతి జిల్లాలోనూ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి…ఇప్పుడుప్పుడే ఆధిక్యం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే కాంగ్రెస్, బీజేపీలు రేసులోకి వచ్చాయో…అప్పటినుంచి టీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. అలాగే ఎక్కడకక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది..దీని వల్ల కొందరు నేతలు వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. దీంతో పలు జిల్లాల్లో టీఆర్ఎస్ వీక్ అవుతూ వస్తుంది.

ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం లాంటి జిల్లాల్లో టీఆర్ఎస్ బలం చాలావరకు తగ్గింది..ఈ జిల్లాల్లో కాంగ్రెస్ బలం పెరుగుతుంది..ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ పికప్ అవుతుంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సైతం టీఆర్ఎస్ వీక్ అవుతుంది…అక్కడ బీజేపీ రేసులోకి వస్తుంది. కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ పరిస్తితి పెద్దగా బాగోలేదు. ఇక టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సీన్ మారుతుంది.

గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 12 సీట్లలో 10 సీట్లు కారు పార్టీ గెలుచుకుంది..రెండు సీట్లు మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి…టీఆర్ఎస్ లోకి వచ్చేశారు. దీంతో టీఆర్ఎస్ బలం 11కు చేరుకుంది. అయితే ఇటీవల ప్రశాంత్ కిషోర్ నిర్వహిస్తున్న ఐప్యాక్ సంస్థ సర్వేలో సగం మంది ఎమ్మెల్యేలకు పాస్ మార్కులే పడటం లేదట. ముఖ్యంగా జంపింగ్ ఎమ్మెల్యే గండ్ర ఈ సారి గడ్డు పరిస్తితులు ఎదుర్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్ నుంచి నిలబడే గండ్ర సత్యనారాయణకు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయట.

వరంగల్ ఈస్ట్, జనగామ, మహబూబా బాద్, డోర్నకల్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లో కూడా కారు ఎమ్మెల్యేలపై నెగిటివ్ ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. మొత్తానికి వరంగల్ జిల్లాలో కారు బోరుకు వచ్చినట్లే కనిపిస్తోంది…రిపేరు చేయకపోతే హస్తం హవా కొనసాగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news