గల్లంతు అయిన మత్స్యకారుల ఆచూకీ లభ్యం అయ్యిందని మాజీ మంత్రి వర్యులు పేర్ని నాని ప్రకటించారు. ఆందోళన చెందుతున్న మా అందరికీ చాలా సంతోషం కలిగించే వార్త ఇదని.. అమలాపురం దగ్గరలోని కొత్తపాలెం దగ్గర మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు వచ్చారని వెల్లడించారు. స్థానిక అధికారులు వారితో టచ్ లోకి వెళ్ళారని.. బందర్ తీసుకుని వచ్చేందుకు వాహనాలు పంపించామని చెప్పారు.
సెర్చ్ ఆపరేషన్ కోసం సహకారం అందించిన ముఖ్యమంత్రి జగన్ కు బందరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు పేర్ని నాని. చంద్రబాబు తన ఎమ్మెల్యేలను చేసినట్లే జగన్ కూడా చేస్తారని పయ్యావుల అనుకుంటున్నట్లు ఉన్నారు.. ఒక ఎమ్మెల్యేగా తనకు కూడా ల్యాప్ టాప్ ఇచ్చారుగా అని ప్రశ్నించారు.
పుచ్చు ఆరోపణలు కాకుండా చిత్తశుద్ధి ఉంటే తన ల్యాప్ టాప్ విప్పి నిఘా ఉందని నిరూపించాలి..
సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి లేదని తీర్మానాలు ఇప్పుడు కేంద్ర నిఘా వ్యవస్థల పై మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.