ముస్లిం సోదరులకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బక్రీద్ శుభాకాంక్షలు

-

భారత్ లో ఇవాళ( జూలై 10, ఆదివారం) ఈదుల్ అజ్ హా(బక్రీద్) ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగ గుణాలకు బక్రీద్ స్ఫూర్తి కలిగిస్తోందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పేర్కొన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని సాగించాలంటే ఒక గొప్ప సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని తెలిపారు. తమకున్న దాంట్లో నుంచి ఇతరులకు పంచి పెట్టడానికి మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని కలిగిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

అలాగే బక్రీద్ పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. “త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీం జీవితం మన అందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈ రోజు త్యాగోత్సవం జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు” అంటూ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news