వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఎమ్మెల్యేలు అందరూ తమ తమ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దురదృష్టవశాత్తు ఇద్దరు నల్గొండ జిల్లాలో చనిపోయారని, వారికి నిబంధనల మేరకు మూడు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామన్నారు. వర్షాలు, వరదల్లో సహాసాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందుకే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామని తెలిపారు. ఎస్ఆర్ఎస్పి ఈ రాత్రికే నిండిపోయిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు.మరోవైపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో హైదరాబాద్ పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఇళ్లలో మరియు చుట్టుపక్కల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.