గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అయితే ఇంకో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ఉన్నతాధికారులుతో భారీ వర్షాలపై సీఎ కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు అందిస్తున్న సహాయక చర్యలు, భారీ వర్షల కారణంగా తీసుకున్న ముందస్తు చర్యలపై చర్చించారు. అయితే.. ఈ సమావేశం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… వచ్చే నాలుగు రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అందుకే విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ప్రకటించామన్నారు.
ఎస్సారెస్పీ ఈ రాత్రికే నిండిపోయినా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదని, వర్షాలు, వరదల్లో సాహసాలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నల్గొండలో ప్రమాదవశాత్తూ గోడకూలి చనిపోయిన ఇద్దరి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున
ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినట్లు.. జిల్లాల వారీగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.