పల్లెల్లో దొరికే ఈ పండ్ల వల్ల లాభాలు ఎన్నో తెలుసా..?

-

మన చుట్టూ పరిసరాలలో మనకు తెలియకుండానే ఎన్నో రకాల పండ్లు,ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య ఎక్కువగా కాలుష్యం టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల వాటిని మనం తినడం మానేశాము. అలా ప్రకృతిలో దొరికేటువంటి వాటిలో రేగు పండ్లు కూడా ఒకటి. ఈ రేగు పండ్ల వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రేగు పండ్లు కేవలం శీతాకాలంలో మాత్రమే దొరుకుతాయి.

మన శరీరంలో రేగు పండ్లు తీసుకోవడం వల్ల కావలసిన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ రేగు పండ్లు తినడం వల్ల మన శరీరంలో ఉండే ఎముకలు చర్మం కండరాళ్లు జుట్టు బాగా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. మన శరీరానికి అవసరమైన పోషకాలు ఈ కాయలలో చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్న రేగు పండ్లు లో ఎక్కువగా మాంగనీసు పొటాషియం, ఐరన్ జింక్ వంటివి ఉండడం వల్ల ఇవి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి.

ఈ రేగు పండ్లు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా తినడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే ఐరన్ చాలా ముఖ్యము ఇది ఐరన్ ఎక్కువగా ఈ పండ్లలో లభిస్తుంది. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు వీటిని ఎక్కువగా తినడం మంచిది.

రేగుపండ్లలో యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మన శరీరంలో కీళ్లవాపులు నొప్పులను తగ్గిస్తాయి. మనం ఏదైనా ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఈ రేగు పండ్లు ను తినడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఇక అంతే కాకుండా మన చర్మం మీద ముడతలు ఉన్నట్లు అయితే అవి పూర్తిగా తొలగిపోతాయి.

మలబద్ధక సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు వీటిని ఒక మోతాదులో తీసుకోవడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు. ఇక పిల్లలు ఈ రేగు పండ్లు ను తినడం వల్ల వారు శారీరకంగా ,మానసికంగా కూడా చాలా ఎదగడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news