వికలాంగులకు గుడ్ న్యూస్..టీచర్ ఉద్యోగాలకు ఆహ్వానం..

-

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో 42 ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కొద్ది రోజులు ఉద్యోగులుగా నియమించనుంది.
ఈ పోస్టుల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కరీంనగర్, మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ అంధుల గురుకుల పాఠశాలలో పని చేయాల్సి ఉంటుంది.

అంతే కాకుండా.. కరీంనగర్, మిర్యాలగూడ, హైదరాబాద్ లోని ప్రభుత్వ బధిరుల గురుకుల పాఠశాలలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహాలలో వీరిని నియమించనున్నారు.ఈ పోస్టులకు పూర్తీ వివరాలు..
ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ,బీఈడీ, స్పెషల్ డీఈడీ (హెచ్ హెచ్ /వీహెచ్), స్పెషల్ బీఈడీ(వీహెచ్/హెచ్ హెచ్), ఎంఏ(సోషల్ వర్క్/సోషియాలజీ), డీపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.. ఆంగ్ల మాధ్యమ బోధనా రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. రిటైర్డ్ టీచర్స్ కూడా దీనికి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.
వయస్సు: 44 ఏళ్లకు మించకూడదు.
జీతం: నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరన ఆఫ్ లైన్ చేయవలసిన ఉంటుంది.దరఖాస్తులను ఆఫ్ లైన్ ద్వారా కింద తెలిపిన మెయిల్ కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఈమెయిల్ ఐడీ ఇదే.. wdsc2021 [email protected]. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 14, 2022. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు wdsc.telangana.gov.in వెబ్ సైట్ ను చూడాలి.. నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చెయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news