టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్ర…ప్రజెంట్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ పుల్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే ఐటెం సాంగ్ కూడా చేసింది ఈ భామ. SMS(శివ మనసులో శ్రుతి) ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..ఆ తర్వాత డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఇండస్ట్రీలో ఏర్పరుచుకుంది.\తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్న నాటి విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెంట్ అని చెప్పి బాంబు పేల్చింది. ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు షాక్ అయ్యారు. రెజీనా కసాండ్ర నిజంగా పెళ్లి కాకుండానే గర్భవతి అయిందా? అని చర్చించుకున్నారు. కాగా, రెజీనా ప్రెగ్నెంట్ అని చెప్పింది ఓ పని కోసమేనని ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.
ఒకరోజు రాత్రి పదకొండు గంటల సమయంలో తనకు స్వీట్ తినాలిపించిదట. దాంతో ఓ స్వీట్ షాప్ వద్దకు వెళ్లింది. అక్కడ వాళ్లు క్లోజ్ చేస్తున్న టైంలో తనకు స్వీట్ కావాలని అడిగింది. దానికి సదరు షాపు నిర్వాహకులు ఇవ్వడం కుదరదని చెప్పగా, తాను ప్రెగ్నెంట్ అని రెజీనా కసాండ్ర అబద్ధం చెప్పింది. అలా ‘మిస్టీ దోయ్ స్వీట్’ కోసం రెజీనా తను గర్భవతినని చెప్పింది.
ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు ‘రెజీనా ఇంత అల్లరి పిల్లనా?’ అని చర్చించుకుంటున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో రెజీనా నటిస్తోంది. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించేందుకు తాను ఎప్పుడు సిద్ధమేనని రెజీనా చెప్తోంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్, యంగ్ హీరో సందీప్ కిషన్ తన కు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్సని చెప్పింది ఈ భామ.