ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆ పదవికి క్యాబినెట్ హోదా కూడా కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. శ్రీకాంత్ రెడ్డి ఈ క్యాబినెట్ హోదాతో రెండేళ్లపాటు పదవిలోకొనసాగుతారు.
శ్రీకాంత్ రెడ్డి… సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల నూతన మంత్రివర్గంలో ఆయనకు తప్పకుండా స్థానం లభిస్తుందని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో, శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విధితమే.