తల్లి కోసం తల్లడిల్లిన పిల్ల కోతి..!

-

తల్లీబిడ్డల అనుబంధం అజరామరం. దానికి చావు లేదు. జంతువులైనా, మనుషులైనా, పక్షులైనా.. ఇంకే జీవి అయినా.. తల్లీబిడ్డల అనుబంధం మాత్రం ఒకేలా ఉంటుంది. తల్లి కోసం బిడ్డ… బిడ్డ కోసం తల్లి తపన పడుతుంటారు. అయితే.. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకున్నది.

ఓ కోతి తన బిడ్డను తీసుకొని రోడ్డు దాటుతోంది. వేగంగా వస్తున్న కారు ఆ కోతిని ఢీకొనడంతో కోతి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కోతి జీవచ్చవంలా పడి ఉండటానికి చూసిన పిల్ల కోతి.. ఆ కోతి దగ్గరుకు వెళ్లి దాని పట్టుకొని విలపించింది. ఆ ఘటనను చూసిన స్థానికులు ఆ తల్లీబిడ్డ అనుబంధాన్ని చూసి కన్నీళ్లు కార్చారు. తల్లిని వదలకుండా అలాగే పట్టుకొని ఉండటంతో జంతు ప్రేమికులు దాన్ని ఆ తల్లికోతి నుంచి విడదీసి వెటర్నరీ హాస్పిటల్ కు తరలించి సేవలందించారు. ఆ తల్లి కోతిని కొంతమంది స్థానికులు అడవిలోకి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. ఇక.. పిల్ల కోతిని కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంచిన తర్వాత అడవుల్లో వదిలేస్తామని జంతు ప్రేమికులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news