హిందూ దేవుళ్లపై ముస్లిం ప్రవక్త వివాదస్పద వ్యాఖ్యలు..

-

హిందూ దేవుళ్లపై అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హిందువులకు 33 కోట్లమంది దేవుళ్లు ఎలా ఉంటారని, అదసలు సాధ్యమేనా? అని ప్రశ్నించారు అదిల్ చిస్తీ. అంతేకాకుండా.. సగం మనిషి, సగం జంతువులా ఉండే వినాయకుడు, హనమంతుడు కూడా దేవుళ్లేనా? అని ప్రశ్నించాడు అదిల్ చిస్తీ. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంస్థలు.

अजमेर दरगाह से जुड़े खादिम का एक और वीडियो वायरल, हनुमान-गणेश के अस्तित्व  पर किया सवाल - ajmer dargah adil chishti questioned existence hindi god and  goddess video viral ntc - AajTak

తన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో స్పందించిన అదిల్‌.. హిందువుల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని అన్నారు. నుపుర్ శర్మను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశానంటూ మరో వీడియోను అదిల్ విడుదల చేశాడు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు అయినా గాయపడి ఉంటే తనను క్షమించాలని కోరారు అదిల్. మరోవైపు, విద్వేష ప్రసంగం చేసి పరారీలో ఉన్న గౌహర్ చిస్తీని రాజస్థాన్ పోలీసులు నిన్న హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నుపుర్‌శర్మ తల తెచ్చి ఇచ్చిన వారికి తన ఇంటిని రాసిస్తానన్న అదే దర్గాకు చెందిన సయ్యద్ సల్మాన్ చిస్తీ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news