KCR దొరగారిది… పిచ్చాపాటి పాలిటిక్స్ – షర్మిల

-

తెరాస ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే రైతులను ఓదార్చినోళ్లు లేరు. జనం వరదల్లో కొట్టుకుపోతున్నా సాయం చేసిన దిక్కు లేదు. ప్రజలు గగ్గోలు పెడుతుంటే పట్టించుకోవాల్సిన పని లేదన్నట్టుగా పాలన గాలికొదిలేసి ఇతర రాష్ట్రాల CMలతో పిచ్చాపాటి పాలిటిక్స్ చర్చిస్తున్నారు KCR దొరగారు అంటూ నిప్పులు చెరిగారు.

ప్రజలు బురదల్లో మునిగిపోయినా, పంట నష్టమైనా, ఉన్న గూడు కొట్టుకపోయినా గోడు వినే దిక్కు లేదు, గోస తీర్చే అండలేదు. అయ్యా కొడుకులకు పదువుల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు. పంపు హౌస్ మోటర్లు మునిగినా, జీతాలు లేట్ అయినా కామన్ అని చెప్పే దొరగార్లకు కామన్ మ్యాన్ కష్టాలు తెలుస్తాయా? అని నిలదీశారు. ఇక మరో ట్వీట్ లో…వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? కనీసం ఏరియల్ సర్వే అయినా చేశాడా? జనం బాధల్లో ఉంటే గుండె ధైర్యం ఇవ్వాల్సింది పోయి గూగుల్ మ్యాప్ చూస్తూ గప్పాలు కొట్టుడా నీ పాలన? అని ఫైర్ అయ్యారు.

ముందస్తు ఎన్నికల మీద పెడుతున్న శ్రద్ధ, పావొంతైనా వరదల మీద పెడితే…నష్టం కొంచమైనా తగ్గేది. వారం రోజులుగా జనాలు వరదల్లో చిక్కుకొని చస్తుంటే, 15 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయి రైతన్న కన్నీరు పెడుతుంటే,రోడ్లు కొట్టుకపోయి రవాణా స్తంభిస్తే,వైద్యం అందించాల్సిన దవాఖానలు మునిగిపోతుంటే,ఆదుకోవాల్సిన అవసరం లేదా? గడి దాటి బయటకురా KCR, బాధితులను ఆదుకో.

Read more RELATED
Recommended to you

Latest news